ఈ ఏడాది ముగింపు దశకు చేరింది. మరికొన్ని గంటల్లో 2024 ఏడాది కాలగర్భంలో కలిసిపోనుంది. కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు యావత్తు ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇక ఇదే సమయంలో ఈ ఏడాది చివరి సూర్యోదయం కొన్ని గంటల ముందే ఆవిష్కృతమైంది. ఈ అద్భుత దృశ్యాల్ని దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా తిలకించారు. దేశ వ్యాప్తంగా సముద్ర తీరాలు, ఇతర పర్యాటక ప్రాంతాల్లో సూర్యుడు ఉదయిస్తున్న దృశ్యాలను ప్రజలు తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.