సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఇదే

505356చూసినవారు
సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఇదే
తెలంగాణ నూతన సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఇదే. ఆయన మొదట OUలో విద్యార్థి నేతగా తన రాజకీయ జీవితం ప్రారంభించాడు. ఆ తరువాత 2006లో రాజకీయాల్లోకి వచ్చారు. అదే ఏడాదిలో జడ్పీటీసీగా గెలిచాడు. 2007లో స్వతంత్ర అభ్యర్థిగా MLC గా విజయం సాధించారు. 2009, 2014 లలో కొడంగల్ నుంచే టీడీపీ తరుపున ఎమ్మెల్యే గా గెలుపొందారు. 2017 వరకు రేవంత్ రెడ్డి టీడీపీకి ఫ్లోర్​ లీడర్​గా వ్యవహరించారు. అదే ఏడాది TDP నుంచి కాంగ్రెస్​లో చేరారు. 2018లో పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​గా పదవి పొందారు. 2019​లో మల్కాజ్​గిరి స్థానం MP గా గెలిచాడు. 2021లో రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్​గా ఎంపిక అయ్యారు. 2023లో కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి కొడంగల్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, తెలంగాణ 2వ సీఎంగా ఎన్నిక అయ్యాడు.

సంబంధిత పోస్ట్