నదులకు, ప్రాజెక్టులకు వరద పోటెత్తినప్పుడల్లా క్యూసెక్కుల నీరు విడుదల చేశారు అని వింటూనే ఉంటాం. క్యూసెక్కు అంటే సెకను కాలంలో ప్రవహించే ఘనపుటడుగుల నీరు అని అర్థం. CUBIC FEET PER SECOND అని అర్థం. ఒక సెకను వ్యవధిలో ఘనపుటడుగుల నుంచి ప్రవహించే నీరు 28 లీటర్లు. ఏదైనా ఒక రిజర్వాయరు నుంచి కాలువ ద్వారా 11 వేల క్యూసెక్కుల నీరు 24 గంటల పాటు ప్రవహిస్తే ఒక టీఎంసీ నీరు వెళ్లిపోతోంది.