రుణమాఫీ ప్రకటన అందుకే చేశారు: హరీష్ రావు

65చూసినవారు
రుణమాఫీ ప్రకటన అందుకే చేశారు: హరీష్ రావు
ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ చేసిన ప్రకటనపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. 'ఎంపీ ఎలక్షన్స్ లో ఓట్లు దండుకోవడం కోసం ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే రేవంత్ రుణమాఫీ చేస్తామని హామీ ఇస్తున్నారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని ఇచ్చిన మాట తప్పినందుకు సీఎం రైతులకు క్షమాపణ చెప్పాలి. రుణమాఫీ కోసం బీఆర్‌ఎస్‌ పార్టీ చేసిన పోరాటానికి భయపడే రేవంత్ ఈ ప్రకటన చేశారు' అని ఎక్స్ వేదికగా విమర్శించారు.

సంబంధిత పోస్ట్