ఈ రిపబ్లిక్ డే ఎంతో ప్రత్యేకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు అవుతుందని, ఇది దేశం మొత్తం గర్వించదగ్గ సందర్భమని పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. భరతమాత విముక్తి కోసం త్యాగం చేసిన వారిని స్మరించుకోవాలన్నారు. ఈ ఏడాది బిర్సా ముండా 150వ జయంతిని జరుపుకున్నామని, వెలుగులోకి రాని ధైర్యవంతులను స్మరించుకోవాలన్నారు.