గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలుగు నటుడు నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారం లభించింది. కళల విభాగంలో బాలకృష్ణ పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు. దీంతో అటు టీడీపీ, ఇటు ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.