ప్రధాని మోదీని చంపేస్తామంటూ బెదిరింపు కాల్

82చూసినవారు
ప్రధాని మోదీని చంపేస్తామంటూ బెదిరింపు కాల్
‘‘ఎన్నికల ప్రచారంలో ఎక్కడో ఓ చోట ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హత్య చేస్తాం’’ అంటూ ఓ గుర్తుతెలియని వ్యక్తి వార్నింగ్ ఇచ్చాడు. సదరు వ్యక్తి ఫోన్ కాల్‌తో చెన్నై నగరంలోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) కార్యాలయం ఒక్కసారిగా హైఅలర్ట్ అయింది. బెదిరింపు కాల్‌లో భాగంగా హిందీలో మాట్లాడిన ఆ వ్యక్తి ఈ హెచ్చరిక చేసిన వెంటనే కాల్‌ను కట్ చేశాడు. కాగా మధ్యప్రదేశ్ నుంచి ఆ బెదిరింపు కాల్ వచ్చిందని గుర్తించారు.

సంబంధిత పోస్ట్