ప్రముఖ మలయాళ దర్శకుడు సనల్ కుమార్ శశిధరన్ పై కేసు నమోదైంది. సోషల్ మీడియాలో తనను వేధిస్తున్నారని ప్రముఖ నటి అతడిపై ఫిర్యాదు చేసింది. దీంతో ఈ 'కాయం' దర్శకుడిపై వెంబడించడం, వేధించడం, నేరపూరిత బెదిరింపు, పరువు నష్టం కింద ఎలమక్కార పోలీసులు కేసు ఫైల్ చేశారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న దర్శకుడు నటిని ఫేస్ బుక్ ద్వారా బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.