విషవాయువు దాడిలో ముగ్గురు మృతి

65చూసినవారు
విషవాయువు దాడిలో ముగ్గురు మృతి
పుదుచ్చేరిలోని రెడ్యార్‌పాళయంలో గ్యాస్‌ ఎటాక్‌తో వృద్ధురాలు, ఆమె కూతురు మృతి చెందారు. పుదునగర్‌లోని మురుగునీటి శుద్ధి కర్మాగారం నుంచి విడుదలైన గ్యాస్ ఇళ్లలోని మరుగుదొడ్లలోంచి బయటకు రావడంతో ఈరోజు ఉదయం మరుగుదొడ్డికి వెళ్తుండగా ఓ వృద్ధురాలు స్పృహతప్పి పడిపోయింది. ఆమెను కాపాడేందుకు వెళ్లిన కూతురు కామాక్షి, మరో 15 ఏళ్ల బాలిక కూడా స్పృహతప్పి పడిపోయింది. వెంటనే వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. ఆ ప్రాంతంలోని ప్రజలు ఇళ్లను ఖాళీ చేయాలని పోలీసులు సూచించారు.

సంబంధిత పోస్ట్