మహిళలకు ఫ్రీ బస్సు.. APSRTCకి తగ్గనున్న రూ.200 కోట్లు రాబడి!

82చూసినవారు
మహిళలకు ఫ్రీ బస్సు.. APSRTCకి తగ్గనున్న రూ.200 కోట్లు రాబడి!
ఏపీలో ప్రస్తుతం ఆర్టీసీకి టికెట్ల రూపంలో నెలకు రూ.500 కోట్లు వస్తున్నాయి. మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే నెలకు సుమారు రూ.200 కోట్లు రాబడి తగ్గుతుందని అంచనా. మరోవైపు ఆర్టీసీ తన రాబడిలో నెలకు రూ.125 కోట్లు ప్రభుత్వానికి ఇస్తోంది. పథకం అమలు చేస్తే ప్రభుత్వానికి చెల్లిస్తున్న రూ.125 కోట్లు నిలిపేయడంతో పాటు, మిగిలిన రూ.75 కోట్లను ప్రభుత్వం నుంచి రీయింబర్స్‌మెంట్‌గా తీసుకోవాల్సి ఉంటుందని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి.

సంబంధిత పోస్ట్