యూపీలో ఇంటిపై కప్పు కూలి ముగ్గురు మహిళలు మృతి

1040చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. మెయిన్‌పురిలోని ఇబ్రహీంపూర్ గ్రామంలో ఇంటిపై కప్పు కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు మృతిచెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన ఇళ్లు సుమారు 15-16 ఏళ్ల నాటిదని, భారీ వర్షం కారణంగా పైకప్పు కూలిపోయిందని పోలీసులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్