తిలక్ వర్మపై భారత మాజీ క్రికెటర్ ప్రశంసలు

83చూసినవారు
తిలక్ వర్మపై భారత మాజీ క్రికెటర్ ప్రశంసలు
భారత యువ క్రికెటర్, తెలుగు కుర్రాడు తిలక్ వర్మపై మాజీ క్రికెటర్ ఆకాశ్‌ చోప్రా ప్రశంసలు కురిపించాడు. టీమిండియాకు నమ్మకమైన మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా మారగల సత్తా ఈ యువ క్రికెటర్‌కు ఉందన్నాడు. ‘కొంతమంది క్రికెటర్లను చాలా త్వరగా సూపర్ స్టార్ అని పిలుస్తున్నాం. ఒకట్రెండు మ్యాచ్‌ల్లో రాణించగానే లెజెండ్ అనే ట్యాగ్ ఇచ్చేస్తున్నాం. తిలక్ వర్మ ఇప్పటికే సూపర్ స్టార్ అని నేను చెప్పడం లేదు. కానీ, ఆ దిశగా అతడి ప్రయాణం సాగుతోంది’ అన్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్