తిరుమల శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన లడ్డూ ప్రసాదానికి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఎంతో ప్రాముఖ్యత గల ఈ లడ్డూని తిరుమలలో ప్రసాదంగా పెట్టడం ప్రారంభించి నేటికి 308 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1715 ఆగస్టు 2న తొలిసారిగా లడ్డూను ప్రసాదంగా పెట్టడం ప్రారంభించారు. ఆలయపోటులో స్వచ్ఛమైన శనగ పిండి, పటిక బెల్లం, నెయ్యి, ఎండు ద్రాక్ష, యాలకులు, జీడిపప్పు, పచ్చకర్పూరంతో ప్రత్యేక పద్ధతుల్లో దీన్ని తయారుచేస్తారు.