తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఎంతో విశిష్టత ఉంది. తిరుమల ఆలయ పోటులో ప్రత్యేకంగా తయారయ్యే ఈ లడ్డూలను స్వామివారి ప్రసాదంగా పంపిణీ చేయడం ప్రారంభించి ఇప్పటికి 308 ఏళ్లు పూర్తయ్యాయి. 1715 ఆగస్టు 2న తొలిసారిగా లడ్డూను భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేయడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. కాలానుగుణంగా పెరుగుతున్న భక్తుల రద్దీ నేపధ్యంలో రోజూ దాదాపు మూడు లక్షల ఇరవై వేల లడ్డూలను టీటీడీ తయారు చేస్తోంది.