రామ్ చరణ్‌ను కలిసేందుకు.. 8 రోజులుగా అభిమాని పాదయాత్ర

75చూసినవారు
ప్రముఖ టాలీవుడ్ నటుడు రామ్ చరణ్‌ను కలిసేందుకు ఓ అభిమాని 8 రోజులుగా పాదయాత్ర చేస్తున్నారు. తన అభిమాన నటుడు చరణ్‌ను ప్రత్యక్షంగా కలిసేందుకు శేఖర్ విజయవాడ నుంచి హైదరాబాద్‌కు పాదయాత్రగా బయలుదేరాడు. శ్రీకాకుళం రాజాంకి చెందిన శేఖర్ గత 8 రోజులుగా పాదయాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. చరణ్‌ను కలిసేందుకు జాతీయజెండా, ప్లకార్డ్‌లు పట్టుకొని దాదాపు 250 కిలోమీటర్లు నడుస్తూ హైదరాబాద్ చేరుకున్నట్లు శేఖర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్