అనంత్ అంబానీ-రాధిక మర్చెంట్ వివాహా వేడుక ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ఈరోజు అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఈ వివాహానికి దేశ, విదేశాల నుంచి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సెలబ్రిటీలు హాజరవుతున్నారు. టాలీవుడ్ నుంచి మహేశ్ బాబు, తన భార్య నమ్రతా శిరోద్కర్ శుక్రవారం ముంబై చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.