యాత్రికుల బస్సు బోల్తా.. ముగ్గురు మృతి, 30 మందికి గాయాలు (వీడియో)

62చూసినవారు
ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కోరాపుట్ జిల్లా బోయిపరిగూడ పోలీసు పరిధిలోని శకుంతల ఘాట్ వద్ద యాత్రికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా.. మరో 30 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా ఆ రాష్ట్ర సీఎం మోహన్ చరణ్ మాఝీనవీన్ పట్నాయక్ ఒక్కో బాధిత కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

సంబంధిత పోస్ట్