TPCC చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ సినీరంగానికి చెందిన సెలబ్రిటీలకు కీలక విజ్ఞప్తి చేశారు. ఓ నటీమణిపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు విచారకరమని పేర్కొంటూ.. సదరు వ్యాఖ్యలను మంత్రి ఉపసంహరించుకున్నారని చెప్పారు. ఇంతటితో ఈ విషయాన్ని వదిలేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భవిష్యత్‌లో సినీరంగానికి చెందిన వ్యక్తులను రాజకీయ వివాదాల్లోకి లాగకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటామని ప్రకటించారు.