విషాదం.. శివాలయం కొలనులో పడి 15 ఏళ్ళ బాలుడు మృతి

57చూసినవారు
విషాదం.. శివాలయం కొలనులో పడి 15 ఏళ్ళ బాలుడు మృతి
TG: హైదరాబాద్‌లోని గాజులరామారం డివిజన్‌ మహదేవపురంలో విషాద ఘటన జరిగింది. అక్కడి శివాలయం కొలనులో ఓ బాలుడు ప్రమాదశాత్తు నీటమునిగి మృతి చెందాడు. గాజులరామారం డివిజన్‌ మహదేవపురం శివాలయం కొలనులో మంగళవారం గుర్తుతెలియని బాలుడు(15) మునిగిపోయాడని స్థానికులు సమాచారం ఇచ్చారు. దీంతో డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సాయంతో గాలించగా బుధవారం బాలుడి మృతదేహం లభ్యమైంది. జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్