బైక్‌పై ఒకే ప్రయాణంలో 126 గొర్రెల రవాణా: కాగ్ నివేదిక

565చూసినవారు
బైక్‌పై ఒకే ప్రయాణంలో 126 గొర్రెల రవాణా: కాగ్ నివేదిక
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ స్కీమ్‌లో దిమ్మతిరిగే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాగ్ తాజా నివేదికలో గొర్రెల పంపిణీలో జరిగిన అవకతవకలపై ప్రస్తావించింది. కారులో 168 గొర్రెలు, అంబులెన్స్‌లో 84 గొర్రెలు, బైక్‌పై 126 గొర్రెలు, ఆటోలో 126 గొర్రెలను ఒకేసారి రవాణా చేసినట్లు అధికారులు బిల్లులు సమర్పించారంటూ కాగ్ తన నివేదికలో పేర్కొంది. ఏడు జిల్లాలో చేపట్టిన ఆడిట్‌లో రూ.253 కోట్లు అవకతవకలు జరిగాయని కాగ్ వెల్లడించింది.

సంబంధిత పోస్ట్