TG: భారీ వర్ష సూచన

12143చూసినవారు
TG: భారీ వర్ష సూచన
ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి మెదక్ వరకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. మరో 4 రోజుల్లో రాష్ట్రమంతా విస్తరించనున్నాయి. ఉపరితల ఆవర్తనం, షియర్ జోన్ కారణంగా రాష్టానికి వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మరో 4 రోజులు రాష్టంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నేడు ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో భారీ వర్షాలు పడనున్నట్లు తెలిపింది.

సంబంధిత పోస్ట్