ఐదు నదుల సంగమం.. ఎక్కడంటే?

79చూసినవారు
ఐదు నదుల సంగమం.. ఎక్కడంటే?
యూపీలోని జలౌన్ జిల్లాలో ఔరయ్యా.. ఇటావా సరిహద్దులో 5 నదుల సంగమం ఉంది. పంచనాద్ అని పిలిచే ఈ ప్రాంతంలో యమునా, చంబల్, సింధ్, పహాజ్, కున్వారీ అనే 5 నదులు ఒకే దగ్గర కలుస్తాయి. హిందూవులు ఈ ప్రదేశాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. భగీరథుడు తన పితామహుల పాపాలను కడగడానికి గంగానదిని భూమికి తీసుకువచ్చినప్పుడు అది ఐదు ప్రవాహాలుగా విడిపోయిందట. తర్వాత అవి చివరికి పంచనాద్‌లో కలిసిపోయాయని పురాణాలు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్