TGSRTC గా మారనున్న టీఎస్ఆర్టీసీ

62చూసినవారు
TGSRTC గా మారనున్న టీఎస్ఆర్టీసీ
ఆర్టీసీ బస్సులను ఇక నుంచి TG సిరీస్ లో రిజిస్ట్రేషన్ చేయించనున్నట్లు సంస్థ అధికారులు తెలిపారు. సంస్థ పేరును సైతం TSRTC నుంచి TGSRTCగా మార్చాలని నిర్ణయించారు. త్వరలో సంస్థ లోగోలోనూ మార్పులు చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో TG అమలుకు కేంద్రం ఇటీవల గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వగా, అన్ని ప్రభుత్వ సంస్థల పేర్లలో TSని TGతో రీప్లేస్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్