శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పిన టీటీడీ

64చూసినవారు
శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పిన టీటీడీ
AP: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. ఇకపై అన్నప్రసాద వితరణ కేంద్రంలో భోజనంతో పాటు మసాలా వడలు పెట్టాలని నిర్ణయించింది. సోమవారం టీటీడీ అన్నప్రసాద కేంద్రంలో ట్రయల్ రన్‌లో భాగంగా దాదాపు 5 వేల మంది భక్తులకు ఉల్లిపాయ వాడకుండా చేసిన మసాలా వడలు వడ్డించారు. ఇక, రేపటి నుంచి అంచెలవారిగా సంఖ్యను పెంచాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ మసాలా వడలు పూర్తిస్థాయిలో రథసప్తమి నుంచి అమలు చేసేందుకు సిద్ధమవుతోంది టీటీడీ.

సంబంధిత పోస్ట్