తెలంగాణ ప్రజా ప్రతినిధులకు టీటీడీ శుభవార్త చెప్పింది. మార్చి 24వ తేదీ నుండి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనం కేటాయించనున్నట్లు తెలిపింది. సోమ, మంగళవారాల్లో తెలంగాణ నుంచి వచ్చే సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనం కేటాయించనున్నారు. బుధ, గురువారాల్లో రూ.300 ప్రత్యేక దర్శనం కేటాయింపు ఉంటుంది. ఒక్కో లేఖపై ఆరుగురికి మించకుండా టీటీడీ దర్శనం కేటాయించనుంది.