ఉగ్ర ముఠా లష్కరే తోయిబా అగ్ర కమాండర్ జియా ఉర్ రెహ్మాన్ అలియాస్ అబు ఖతాల్(43) పాకిస్థాన్‌లో హతమయ్యాడు. పంజాబ్‌లోని జీలం ప్రాంతంలో శనివారం గుర్తుతెలియని వ్యక్తి కాల్చి చంపాడని అధికారులు ఆదివారం వెల్లడించారు. ఇతడు జమ్మూకశ్మీర్‌లో పలు ఉగ్రదాడులకు పాల్పడ్డాడు. 26/11 ముంబయి దాడులకు సూత్రధారి అయిన హఫీజ్ సయీద్‌కు అబు ఖతాల్ సన్నిహితుడు. దీంతో పాకిస్థాన్ జైల్లో ఉన్న హఫీజ్ సయీద్‌కు భద్రతను పటిష్ఠం చేశారు.