తెలంగాణలో గతంతో పోలిస్తే ధాన్యం దిగుబడి పెరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మీడియాతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిట్‌చాట్ నిర్వహించారు. 'ఎక్కువ విస్తీర్ణంలో వరి సాగు జరిగింది. ముఖ్యంగా రబీలో సన్నరకాలు అధికంగా వేశారు. దీంతో సీజన్ 20 రోజులు పెరిగి, సాగునీటి సమస్య తలెత్తింది. వ్యవసాయ శాఖ ప్రచారం చేసినప్పటికీ, రైతులు వరి సాగునే ఎక్కువగా ఇష్టపడ్డారు' అని వ్యాఖ్యానించారు.