'40 రోజుల్లో 7 సార్లు పాముకాటు' కేసులో ట్విస్ట్

78చూసినవారు
'40 రోజుల్లో 7 సార్లు పాముకాటు' కేసులో ట్విస్ట్
యూపీలోని ఫతేపూర్ జిల్లాకు చెందిన వికాస్ దూబే తనని 40 రోజుల్లో పాము ఏడుసార్లు కాటు వేసిందని పేర్కొనడం ఇటీవల వైరలైంది. అయితే నిజంగానే పాము పగబట్టిందా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ అతను ఒక్కసారే పాము కాటుకు గురయ్యాడని దర్యాప్తులో తేలింది. స్నేక్ ఫోబియా వల్ల అతను పాముకాట్లకు గురైనట్లు భ్రమపడ్డాడని వైద్యాధికారులు తెలిపారు. అతనికి పరీక్షలు చేయకుండానే వైద్యులు ట్రీట్మెంట్ ఇవ్వడంతో ఈ సంగతి తెలియలేదట.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్