ఇండియన్ కోస్ట్‌గార్డ్ రెండు బంగ్లాదేశ్ నౌకలను సీజ్ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా భారతీయ సముద్ర జలాల్లో అక్రమంగా చేపల వేట సాగిస్తుండడంతో ఈ చర్యలు చేపట్టింది. అలాగే, 78 మంది మత్స్యకారుల్ని అదుపులోకి తీసుకుంది. అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ(ఐఎంబీఎల్) వెంబడి సాధారణ పెట్రోలింగ్ సమయంలో ఈ ఆపరేషన్ జరిగింది. మత్స్యకారులు, ఓడలపై భారతదేశ మారిటైమ్ జోన్స్ చట్టం, 1981 కింద కేసు నమోదు చేశారు.