రెండు బైకులు ఢీ.. ఒకరు స్పాట్ డెడ్ (వీడియో)

55చూసినవారు
తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో శుక్రవారం షాకింగ్ ఘటన జరిగింది. పెండ్లి పాకల గ్రామం సమీపంలోని ఎక్స్ రోడ్డులో ఓ బైకర్ రోడ్డు దాటేందుకు యత్నించాడు. అదే సమయంలో మరో బైక్ వేగంగా దూసుకొచ్చింది. రోడ్డు దాటుతున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఒకరు చనిపోయారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన వీడియో సీసీ కెమెరాలో నిక్షిప్తం అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్