కదులుతున్న ట్రక్కు వెనుక ఇద్దరు కుర్రాళ్లు స్కేటింగ్ స్టంట్స్ చేస్తున్న భయానక వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇందులో స్కేట్‌బోర్డ్ లు ధరించిన ఇద్దరు అబ్బాయిలు వేగంగా వెళ్తున్న ట్రక్కు వెనుక పట్టుకుని వేలాడుతున్నట్లు కనిపిస్తున్నారు. ఈ వీడియో బంగ్లాదేశ్‌లోని ఢాకాకు చెందినదని.. దీనిని బిజోయ్ సరణి మెట్రో స్టేషన్ సమీపంలో చిత్రీకరించారని పేర్కొన్నారు.