TG: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ నుంచి గోదావరిఖని వెళ్తుండగా రోడ్డుపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ప్రమాదంలో గోదావరిఖనికి చెందిన ఇమ్రాన్, ఎండీ గౌస్ అనే ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతదేహాలను సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.