భారీ వర్షం.. వేర్వేరు ఘటనల్లో ఐదుగురు మృతి

67చూసినవారు
భారీ వర్షం.. వేర్వేరు ఘటనల్లో ఐదుగురు మృతి
తెలంగాణలో వేర్వేరు ఘటనల్లో గురువారం ఐదుగురు మృతి చెందారు. నాగర్‌కర్నూల్(D) పదర(M) కోడోనిపల్లెలో పొలంలో పనిచేస్తున్న గాజుల వీరమ్మ (60), సుంకరి సైదమ్మ (45)లు పిడుగుపాటుకు మృత్యువాత పడ్డారు. గద్వాల(D) మానవపాడు(M) చంద్రశేఖర్ నగర్‌కు చెందిన బోయ చిన్నవెంకటేశ్వర్లు(41), అదే మండలం బుడమర్సుకు చెందిన మహేంద్ర(19) పశువులను మేపడానికి వెళ్లి పిడుగుపాటుకు మృతి చెందారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో గోడకూలి ఇమ్మల్లాఖాన్(50) మృతి చెందారు.

సంబంధిత పోస్ట్