శ్రీ సత్యసాయి జిల్లాలో గుర్రాలకోటపై ఉన్న కేతిరెడ్డి గెస్ట్‌హౌస్ స్థలం ప్రభుత్వ భూమిగా రెవెన్యూ అధికారులు గుర్తించారు. అతని భార్య వసుమతి పేరుతో 2 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసినట్టు వెల్లడించారు. అయితే, ఈ స్థలం తనదే అంటూ కేతిరెడ్డి గతంలో హైకోర్టును ఆశ్రయించగా, ప్రభుత్వానికి అప్పగించాలని కోర్టు ఆదేశించింది. దీంతో గెస్ట్‌హౌస్ స్వాధీనం చేసుకోడానికి వెళ్లిన అధికారులు, తాళం వేసి ఉండటంతో వెనుదిరిగారు.