ఢిల్లీలో ఓ మైనర్ నిర్లక్ష్యపు కారు డ్రైవింగ్.. రెండేళ్ల చిన్నారి ప్రాణాలు బలి తీసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఆదివారం పహర్‌గంజ్ ప్రాంతంలో ఓ చిన్నారి ఇంటి బయట వీధిలో ఆడుకుంటోంది. ఆ సమయంలో ఓ 15 ఏళ్ల బాలుడు కారు నడుపుకుంటూ వచ్చి ఆడుకుంటున్న చిన్నారిపైకి ఎక్కించాడు. దాంతో చిన్నారి కారు చక్రాల కింద నలిగి అక్కడిక్కడే చనిపోయింది. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ఆ మైనర్ తండ్రిని అదుపులోకి తీసుకున్నారు.