పంజాబ్‌లోని బర్నాలాలో దారుణం జరిగింది. రెండేళ్ల చిన్నారిని ఒక కారు ఢీకొట్టింది. బాలిక నడుచుకుంటూ వస్తుండగా కారు ఒక్కసారిగా ముందుకు కదలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. బాలికను ఢీకొట్టిన కారు ఒక ప్రైవేట్ పాఠశాల యాజమాన్యానికి చెందినదిగా తెలుస్తోంది. కారు ఢీకొనడంతో రెండేళ్ల బాలిక మరణించింది. ఈ యాక్సిడెంట్‌కు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి.