ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫైబర్ నెట్‌లో ఇప్పటి వరకు 600 మందిని తొలగించాం.. త్వరలోనే సంస్థ విస్తరణ చేయనున్నామని తెలిపారు. సంస్థలో తొలగించిన వారి స్థానంలో మళ్లీ ఉద్యోగాలు ఇస్తామని స్పష్టం చేశారు. కేబుల్ ఆపరేటర్ల మీద గత ప్రభుత్వ హయాంలో రూ.100 కోట్లు జరిమానా వేశారు. దీనిపై విచారణ జరిపి అడ్డగోలుగా వేసిన జరిమానాలను రద్దు చేయాలని నిర్ణయించామన్నారు.