రజనీకాంత్‌కు UAE గోల్డెన్ వీసా (Video)

59చూసినవారు
సౌత్ ఇండియా స్టార్ హీరో సూపర్ స్టార్ రజనీకాంత్‌కు మరో గౌరవం దక్కింది. యూఏఈ ప్రభుత్వం వివిధ రంగాల్లో పేరు పొందిన వారిని సత్కరించేందుకు గోల్డెన్ వీసాను అందిస్తోంది. తాజాగా ఆ జాబితాలో రజనీకాంత్ చేరారు. తాను యూఏఈ గోల్డెన్ వీసా అందుకోవడం గౌరవంగా భావిస్తున్నానని సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. ఈ సందర్భంగా యూఏఈ ప్రభుత్వానికి, లులూ గ్రూప్ చైర్మన్‌కి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్