పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో గణతంత్ర దినోత్సవం రోజున డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని కొందరు ధ్వంసం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అమృత్‌సర్‌లోని టౌన్ హాల్ వద్ద ఉన్న బాబా సాహెబ్ డాక్టర్ అంబేడ్కర్ విగ్రహంపై ఒక యువకుడు సుత్తితో దాడి చేశాడు. అలాగే, రాజ్యాంగ ప్రతులను దహనం చేశారు. ఈ ఘటనలో నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.