ఎంపీ పదవికి రాజీనామా చేసిన తర్వాత విజయసాయి రెడ్డి ఎక్స్ వేదికగా ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. అది ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. రిపబ్లిక్ డే పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన AP ఏటికొప్పాక బొమ్మల శకటంపై విజయసాయి ప్రశంసలు కురిపించారు. అయితే ఇన్ని రోజు ఏపీలోని కూటమి సర్కార్‌ను విమర్శించిన సాయిరెడ్డి.. తాజాగా ఏపీ ప్రభుత్వం పంపిన శకటాన్ని పొగుడుతూ ట్వీట్ చేయడంతో నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.