శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి భక్తులకు ఈవో శ్రీనివాసరావు గుడ్‌న్యూస్ చెప్పారు. శ్రీశైలంలో ఈ నెల 27 నుంచి 31 వరకు ఉగాది మహోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉత్సవాల ఏర్పాట్లపై సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు రానుండడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.