మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, క్రీడా వ్యవహారాల సలహాదారు జితేందర్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో క్రీడలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని దుయ్యబట్టారు. సీఎం రేవంత్ రెడ్డి స్వతహాగా క్రీడా ప్రేమికుడు, క్రీడాకారుడని చెప్పారు. క్రీడలకు కనీవినీ ఎరుగని స్థాయిలో సీఎం రేవంత్ నిధులు కేటాయించారని చెప్పారు. ఈ క్రమంలోనే తనకు ప్రభుత్వ క్రీడా వ్యవహారాల సలహాదారు పదవి ఇచ్చినట్లు తెలిపారు.