తెలంగాణలో 162 మంది అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్లను వ్యవసాయ శాఖ సస్పెండ్ చేసింది. యాప్ డౌన్లోడ్ చేసి డిజిటల్ సర్వే చేయకపోవడంతో వారిని తప్పించారు. దీంతో వారిపై సస్పెన్షన్ ఎత్తేసే వరకు తాము విధులకు హాజరుకాబోమని ఏఈవోల జేఏసీ ప్రకటించింది. సస్పెన్షన్ అన్యాయమని, రాష్ట్ర వ్యాప్తంగా తమ పై అధికారులకు మాస్ లీవ్ లెటర్లు ఇచ్చామని తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్ లో భారీ ధర్నా చేపట్టనున్నారు.