చెరువుల్లో నీటి నాణ్యత, లోతు, విస్తీర్ణం, చేపల కదలికలు రోజూ గమనించాలి. చేపల పెరుగుదల, రంగు, లక్షణాలు పరిశీలించి, తేడా ఉంటే మత్స్యశాఖ సలహాలతో చర్యలు తీసుకోవాలి. ఆక్సిజన్ కొరత ఉంటే నీరు పెట్టాలి లేదా చేపలను అమ్మేయాలి. సున్నం (100-250 కిలో/హెక్టారు) చల్లితే నీటి నాణ్యత, ఆక్సిజన్ పెరుగుతాయి. కలుపు మొక్కలు తొలగించాలి, వ్యాధితో చనిపోయిన చేపలను కాల్చి, BKC (1 లీ/హెక్టారు) వాడాలి.