భారత్ అధికారికంగా 2030 కామన్‌వెల్త్ గేమ్స్‌ను అహ్మదాబాద్‌లో నిర్వహించేందుకు బిడ్ సమర్పించింది. ఈ బిడ్ విజయవంతమైతే, 2010లో న్యూఢిల్లీలో జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్ తర్వాత రెండవసారి ఈ స్పెషల్ ఈవెంట్‌కు ఆతిథ్యమివ్వనుంది. నరేంద్ర మోదీ స్టేడియం, గిఫ్ట్ సిటీ వంటి ఆధునిక స్పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఈ బిడ్ వచ్చేందుకు ప్రధాన అంశాలు. ఇండియాకు పోటీగా కెనడా, యూకే వంటి దేశాలు ఉన్నట్లు సమాచారం.