ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు సంబంధించి యోగి సర్కార్‌పై మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. యూపీ ప్రభుత్వం వీఐపీ అతిథులకు ఇస్తున్న ప్రాధాన్యత సాధారణ భక్తులకు ఇవ్వడం లేదని ఆరోపించారు. దీంతో భక్తులు మైళ్లు నడిచి అక్కడికి చేరుకుంటున్నారని పేర్కొన్నారు. దీని కారణంగా వృద్ధులు, పిల్లలు, మహిళలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.