ఈ ఏడాది జనవరి నుంచి నవంబరు వరకు 15,547 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. వీటి విలువ రూ.223 లక్షల కోట్లుగా నమోదైందని ఆర్థిక మంత్రిత్వశాఖ తాజాగా వెల్లడించింది. ప్రస్తుతం యూఏఈ, సింగపూర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, మారిషస్ వంటి కీలక మార్కెట్లలో యూపీఐ పని చేస్తోంది. ఎన్‌పీసీఐ ద్వారా 2016లో యూపీఐ ప్రారంభమైంది. గత నెలలో 1,658 కోట్ల యూపీఐ లావాదేవీలు నమోదు కాగా, వీటి విలువ రూ.23.49 లక్షల కోట్లుగా ఉంది.