ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇస్తేనే వస్తుంది: పవన్‌ కల్యాణ్‌

58చూసినవారు
ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇస్తేనే వస్తుంది: పవన్‌ కల్యాణ్‌
వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆ పార్టీ నేతలు స్పీకర్‌ను కోరడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇస్తేనే వస్తుందని స్పష్టం చేశారు. 11 సీట్లు ఉన్న పార్టీకి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఇవాళ రెండో అతిపెద్ద పార్టీగా జనసేన అవతరించిందని పేర్కొన్నారు. సభకు రావాలి.. ప్రజా సమస్యలు ప్రస్తావించాలని హితవు పలికారు. వైసీపీ సభ్యులకు స్పీకర్‌ కూడా ఎంతో గౌరవం ఇచ్చారని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్