SLBC టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మందిని రక్షించేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. రెండు రోజులుగా సహాయక చర్యలు నిర్విరామంగా సాగుతున్నాయి. ప్రమాదం జరిగిన టన్నెల్ 14వ కిలోమీటర్‌కు సమీపంలో 19.5 కిలోమీటర్ల వద్దకు రక్షణ బృందాలు చేరుకున్నాయి. 11వ కిలోమీటర్ల వరకు లోకోట్రైన్లో వెళ్లిన సహాయక సిబ్బంది అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లారు. 13.5 నుంచి 14 కిలోమీటర్ల మధ్యలో కార్మికులు చిక్కుకొని ఉంటారని సహాయ బృందాలు భావిస్తున్నాయి.