ఐసీసీ నిబంధనలకు
ఆస్ట్రేలియా టెస్టు జట్టు ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా వ్యతిరేకంగా ముందుకెళ్లనున్నాడని సమాచారం. పాలస్తీనా ప్రజలకు మద్దతు ప్రకటించేందుకు గాను తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు, తన దృష్టిలో ప్రజలంతా సమానమేనని, ఆ సందేశాన్ని ఇవ్వడానికి తననెవరూ అడ్డుకోలేరని స్పష్టం చేస్తున్నాడు. డిసెంబర్ 14న పాకిస్తాన్‌తో పెర్త్ వేదికగా జరగాల్సి ఉన్న తొలి టెస్టులో తాను వేసుకోబోయే షూస్‌పై ‘అందరి జీవితాలు సమానమే’ అని సందేశాన్ని ఇవ్వనున్నట్టు చెప్పకనే చెప్పాడు.